NTV Telugu Site icon

Medical Scam: రూ.800 కోట్ల కుంభకోణంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అల్లుడి పేరు..

Medical Scam

Medical Scam

Medical Scam: రూ. 800 కోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణితో పాటు మరో ఐదుగురిపై సీబీఐ, కర్ణాటక లోకాయుక్తలో సోమవారం ఫిర్యాదు నమోదైంది. బీజేపీ బెంగళూర్ సౌత్ జిల్లా అధ్యక్షుడు ఎన్ ఆర్ రమేష్ ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డెంటల్ కాలేజీ మేనేజ్‌మెంట్ కమిటీ చీఫ్ రాధాకృష్ణ దొడ్డమణిని కీలక నిందితుడిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అవినీతి, మోసం, నకిలీ పత్రాలను సృష్టించడం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలు ఆయనపై మోపబడ్డాయి.

ఈ కేసులో హెచ్‌ఎస్‌ మహదేవప్రసాద్‌, డాక్టర్‌ ఎన్‌టీ మురళీమోహన్‌, వీఎస్‌ కుబేర్‌లు ఇతర నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అమానుల్లా ఖాన్‌పై కూడా ఫిర్యాదు నమోదైంది. ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి ధనక కుటుంబాలకు చెందిన అర్హత లేని వారు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చదివేందుకు వందల కోట్లు తీసుకున్నట్లు ఎన్ ఆర్ రమేష్ ఆరోపించారు. డాక్టర్ BR అంబేద్కర్ మెడికల్ కాలేజీ మరియు డాక్టర్ BR అంబేద్కర్ డెంటల్ కాలేజీలలో అడ్మిషన్లకు సంబంధించి రూ. 800 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదని ఆయన ఆరోపించారు.

READ ALSO: Supriya Sule: ఓటు వేసి అజిత్ పవార్ తల్లి ఆశీర్వాదం తీసుకున్న సుప్రియా

2008-09 నుంచి నేటి వరకు మేనేజ్మెంట్ కోటా కింద అడ్మిషన్లకు సంబంధించి వేలల్లో అక్రమాలు జరిగాయని అన్నారు. నాలుగో తరగతి ఉద్యోగి అమానుల్లా ఖాన్‌ని పీఆర్ఓగా నియమించిన తర్వాత, పరీక్షలోల ఫెయిల్ అయిన విద్యార్థులకు అన్ని నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించి అడ్మిషన్లు ఇచ్చారని ఎన్ఆర్ రమేష్ తెలిపారు. 12వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల నుంచి సర్టిఫికేట్లు పొంది ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇచ్చినట్లు తెలిపారు. నిందితులు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఇంటర్నల్స్‌లో 100 శాతం మార్కులు ఇవ్వడానికి లక్షలు తీసుకుని మోసానికి పాల్పడినట్లు తెలిపారు.

ఫిర్యాదుదారు బెంగళూర్‌కి చెందిన అనర్హుల్లో ఒకరి వివరాలను అందించారు, అతని మార్కు షీట్లను జార్ఖండ్‌లోని కళాశాల నుంచి అరేంజ్ చేశారని, అయితే అతనికి కర్ణాటకలో మెడికల్ సీటు లభించిందని, 15 ఏళ్లుగా ఇలాంటి కుంభకోణం జరుగుతోందని రమేష్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రస్తుతం అమానుల్లా ఖాన్ రూ. 500 కోట్లలతో తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నట్లు ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అతని అల్లుడు రాధాకృష్ణ, 18 ప్రయత్నాలలో తన MBBS కోర్సును పూర్తి చేయడానికి తొమ్మిదేళ్లు తీసుకున్న వ్యక్తిని ప్రొఫెసర్‌గా నియమించారని, ఆ తర్వాత ఆ వ్యక్తి ఎండీ కోర్సు కూడా పూర్తి చేశాడని రమేష్ అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కలబురగి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాధాకృష్ణ దొడ్డమాని పోటీ చేస్తున్నారు.

Show comments