NTV Telugu Site icon

Lucknow Building Collapses: లక్నోలో కూలిన బిల్డింగ్.. నలుగురు మృతి

Lucknowbuildingcollapses

Lucknowbuildingcollapses

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. 15 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 20 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: India-UAE Ties: సోమవారం భారతదేశానికి రానున్న యూఏఈ క్రౌన్ ప్రిన్స్..

లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్‌లో మధ్యాహ్న సమయంలో 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. రంగంలోకి దిగిన సహాయ బృందాలు క్షతగాత్రులను ఆసియానా ప్రాంతంలోని లోక్‌బంధు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

లక్నోలో భవనం కూలడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ ప్రమాదం బాధాకరం అన్నారు. లక్నో జిల్లా మేజిస్ట్రేట్‌తో ఫోన్‌లో మాట్లాడి సంఘటన స్థలంలో పరిస్థితి గురించి సమాచారాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు. స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని కేంద్రమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు.

 

Show comments