Malegaon blasts case: 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ నిర్దోషిగా విడుదలయ్యారు. నిర్దోషిగా విడుదలైన తర్వాత ఆయనకు “కల్నల్”గా ప్రమోషన్ లభించింది. జూలై 1న ప్రత్యేక NIA కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన ఏడుగురు నిందితులలో శ్రీ పురోహిత్ కూడా ఉన్నారు. కేవలం అనుమానం మాత్రమే సాక్ష్యాన్ని భర్తీ చేయదని కోర్టు పేర్కొంది. ఆయన పాత్రకు సంబంధించిన బలమైన ఆధారాలు లేవని పేర్కొంది.
Read Also: OG : ఓజీ మూవీ టీమ్ కు హైకోర్టులో ఊరట..
సెప్టెంబర్ 29, 2008న జరిగిన పేలుడులో ఆరుగురు వ్యక్తులు మరణించారు,100 మందికి పైగా గాయపడ్డారు, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాలేగావ్ పట్టణంలోని ఒక మసీదు సమీపంలో మోటార్ సైకిల్ లో అమర్చిన బాంబు పేలింది. ఈ కేసులో భారత సైన్యంలో పనిచేస్తున్న అధికారిన అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ కేసును కొన్ని రాజకీయ పార్టీలు ‘‘హిందూ ఉగ్రవాదం’’గా పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ కేసులో యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ఇరికించాలని కొందరు ప్రయత్నించినట్లు ఆయన పేర్కొన్నారు.
లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ మాత్రమే కాకుండా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో మాజీ బిజెపి ఎంపీ ప్రగ్యా ఠాకూర్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ (రిటైర్డ్), అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ఉన్నారు. వీరందరిని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
