NTV Telugu Site icon

Parliament Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ

Speaker Om Birla

Speaker Om Birla

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఈ నెల 18వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఇక, ఆదే రోజు రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగోబుతున్నాయి.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్న నేపథ్యంలో.. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి.. ఇదే, సమయంలో.. వారిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది అధికార పక్షం.. ఇక, ఈ సారి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు… అయితే, పార్లమెంటు సభ్యుల నోరు నొక్కేలా కొన్ని పదాలపై నిషేధం విధించారని విపక్షాలు మండిపడుతున్నాయి.. పార్లమెంటు ఆవరణలో ఎంపీలు ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేయకూడదంటూ మరో నిరంకుశ చర్యకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అన్‌పార్లమెంటరీ పదాల బుక్‌లెట్‌ను తాజాపరిచే పేరుతో మరో 65 పదాలను నిషేధిత జాబితాలో చేర్చుతూ గురువారం లోక్‌సభ ఒక గ్యాగ్‌ ఆర్డర్‌ను జారీ చేసింది.. ఇక, శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పిసి మోడీ.. పార్లమెంటు ఆవరణలో ధర్నాలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయరాదంటూ మరో నిషేధం విధించారు. దీనిపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి..

Read Also: Krishna River Management Board: తెలుగు రాష్ట్రాలకు లేఖ అనుమత్తుల్లేని వాటిని ఆపండి..

ఇక, పార్లమెంట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర నిర్ణయించింది.. ఇక, అదే రోజు మధ్యాహ్నం ప్రతిపక్షాలు భేటీ కానున్నాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాష్‌ బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఆయా సభల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం కాబోతున్నారు.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. ఫ్లోర్‌ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆదివారం వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశం కాబోతున్నారు.. గ్యాస్‌ ధర పెంపు, రూపాయి పతనం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి అంశాలను లేవనెత్తడానికి విపక్షాలు సిద్ధం అవుతుంటే.. వారిని కట్టడి చేయడంపై అధికారపక్షం ఫోకస్‌ పెట్టింది..