ప్రేమ వ్యవహారాల్లో ఎన్నో మలుపులు ఉంటాయి.. ప్రేమించుకున్నా వారి ఇళ్లలో పెళ్లికి అంగీకరించకపోవడంతో విడిపోయినవారు కొందరైతే, పట్టుబట్టి పెళ్లిచేసుకున్నవారు కొందరు.. ప్రాణాలు పోగొట్టుకున్నవారు లేకపోలేదు, ఇక, వారిని ఒప్పించలేక, విడిగా బతకలేక.. ఎక్కడికో వెళ్లిపోయి పెళ్లిచేసుకున్న ప్రేమజంటలు మరెన్నో.. మరోవైపు, పెళ్లి జరుగుతుండగా మధ్యలో ఎంట్రీ ఇచ్చి షాక్‌లిచ్చిన ప్రేమికులు కూడా లేకపోలేదు.. ఈ మధ్య హైదరాబాద్‌లో ప్రియురాలి పెళ్లి మండపంలో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది.. తనకు మంటలు అంటించుకుని.. ప్రియురాలికి కూడా అంటించే ప్రయత్నం చేశాడు.. ఈ ఘటనలో ప్రియురాలు గాయాలతో బయటపడింది.. తాజాగా, బీహార్‌లోని నలందా జిల్లా హర్‌నౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ప్రియురాలి పెళ్లి మధ్యలో ప్రియుడు ఎంట్రీ ఇవ్వడంతో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది..
Read Also: Nallari Kishore Kumar Reddy: పెద్దిరెడ్డికి నా సవాల్.. జగన్ బొమ్మ లేకుండా గెలిచే దమ్ముందా..?
బీహార్‌లోని ముబారక్‌పూర్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి విరాల్లోకి వెళ్తే.. పెళ్లి మండపం సందడిగా ఉంది.. ఇంతలోనే సందులో సడేమియా అన్నట్టుగా.. మధ్యలో ప్రత్యక్షమయ్యాడు ముకేష్ కుమార్ అనే యువకుడు.. ఆ వెంటనే వధువు నుదుట సింధూరం పెట్టేశాడు.. ఆ తర్వాత దర్జాగా అక్కడే నిలిచున్నాడు.. ఏం జరుగుతుందో తెలియక పెళ్లి కుమారుడు షాక్ తింటే.. అక్కడే ఉన్న ఓ మహిళ.. ముకేష్ చెంప చెల్లుమనిపించింది.. ఇక, వధువు బంధువులు ఆ యువకుడికి చుక్కలు చూపించారు.. అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.. ఈ ఘటనలో ముకేష్ తలపై, ముఖానికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆ తర్వాత పెళ్లికి వచ్చిన పెద్దలు గ్రామస్తుల సహాయంతో ఆస్పత్రిలో చేర్చారు.. పెళ్లి మండపంలో జరిగిన వ్యవహారంపై వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. ముకేష్‌ను విచారించారు.
అయితే, పోలీసుల విచారణలో అసలు కథ బయట పడింది.. ఆ యువకుడు చెప్పిన విషయాలతో అంతా షాక్ తినాల్సి వచ్చింది.. ఎందుకంటే.. ఏడాది కాలంగా వధువు, తాను ప్రేమలో ఉన్నామని.. పెళ్లి చేసుకుందామని భావించినా వారి ఇంట్లో ఒప్పుకోలేదని.. అంతేకాదు మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమయ్యారని తెలిపాడు బాధితుడు. ఇక, వధువుకు నాకు ఫోన్ చేసి.. తన పెళ్లికి రావాలని.. పెళ్లి సమయంలో తన నుదుట సింధూరం పెట్టాలని కోరిందని వెల్లడించారు.. అందుకే తాను పెళ్లిలో అలా చేసినట్టు చెప్పుకొచ్చాడట.. అయితే, సింధూరం పెట్టిన తర్వాత మాత్రం ఏం చేయాలి అనే విషయం ప్రియుడికి చెప్పలేదట ప్రియురాలు.. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారిపోయింది.
https://twitter.com/UtkarshSingh_/status/1544909107567550464?cxt=HHwWgICj7bypz_AqAAAA
