NTV Telugu Site icon

Loud speakers row: మహారాష్ట్ర్రలో కాకరేపుతున్న లౌడ్ స్పీకర్స్ వివాదం

1036739 Uddhav Raj

1036739 Uddhav Raj

దేశవ్యాప్తంగా మహాారాష్ట్ర రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని మహరాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లతో ప్రార్థనలు వినిపిస్తే దానికి ప్రతిగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా వినిపిస్తామని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మే 3 వరకు గడువు రాజ్ ఠాక్రేకు శివసేన సర్కార్ కు గడువు విధించారు. దీనికి తోడు ఇటీవల అమరావతి ఎంపీ నవనీత్ రాణా… సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇళ్లు ‘ మాతోశ్రీ’ ముందు హనుమాన్‌ చాలీసా వినిపించేందుకు సిద్ధం కావడం.. ఎంపీ నవనీత్‌ రాణా, ఆమె భర్త రవి రాణాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి బెయిల్ రావడంతో బయటకు వచ్చారు.

మహారాష్ట్రలో హిందుత్వం కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ జరుగుతోంది. హఠాత్తుగా రాజ్‌ ఠాక్రే లౌడ్ స్పీకర్‌ వర్సెస్‌ హనుమాన్‌ చాలీసా వివాదం రాజేయడంతో హిందుత్వాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ మాత్రం ఎంఎన్‌ఎస్, రాజ్‌ ఠాక్రే వెనక బీజేపీ పార్టీ ఉందని ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రోద్భలంతోనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అధికారం కోసం శివసేన భావవైరుధ్యం ఉన్న కాంగ్రెస్‌, ఎన్సీపీతో జతకట్టడంతో… శివసేన తన హిందుత్వాన్ని విడిచిపెట్టిందనే భావన కలిగించేలా ఎంఎన్ఎస్‌ లౌడ్ స్పీకర్ల వివాదాన్ని రాజేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు శివసేన హిందుత్వ పార్టీ ఉండీ ప్రస్తుతం తన సిద్ధాంతాన్ని విడిచిపెట్టిందనే భావన ప్రజల్లో కలిగించేలా.. మహారాష్ట్రలో హిందుత్వానికి బ్రాండ్ గా నిలిచేలా రాజ్‌ ఠాక్రే ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ హిందుత్వానికి శివసేన స్కూల్‌ వంటిదని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రం రాజ్‌ ఠాక్రేను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాజ్ ఠాక్రేకు పలు 2008లోని ఓ కేసులో రాజ్ ఠాక్రేకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్ట్. ఈ పరిణామాల మధ్య వచ్చే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కలిసి పోటీ చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.