Site icon NTV Telugu

Lord Hanuman on Aircraft: విమానంపై మళ్లీ ప్రత్యక్షం అయిన హనుమాన్ చిత్రం..

Aero Show 2023

Aero Show 2023

Lord Hanuman on Aircraft: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రూపొందించిన ప్రోటోటైప్ ఎయిర్‌క్రాఫ్ట్ పై హనుమంతుడి బొమ్మ వివాదాస్పదం అయింది. అయితే దీనిని ఆ తరువాత తొలగించారు. ఇదిలా ఉంటే బెంగళూర్ లో జరుగుతున్న ఏరో ఇండియా షోలో చివరి రోజు విమానంపై హనుమాన్ స్టిక్కర్ ప్రత్యక్షం అయింది. దీనిపై హెచ్ఏఎల్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఇటీవల ఏరో షో తొలిరోజు విమానాల ప్రదర్శనలో భాగంగా హెఏఎల్ కొత్తగా రూపొందించిన సూపర్ సోనిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ HLFT-42 తోకపై హనుమాన్ బొమ్మ ఉంది. అయితే దీనిని ఆ తరువాతి రోజు తొలగించారు. అయితే ఏరో షోలో చివరి రోజు మళ్లీ హనుమాన్ చిత్రం కనిపించింది.

Read Also: IPL 2023: ఐపీఎల్ ఆరంభానికి ముందే రాజస్తాన్‌కు భారీ షాక్!

విమానం శక్తిని సూచించేందుకే హనుమంతుడి చిత్రాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్లు హెచ్ఏఎల్ వెల్లడించింది. ఆంజనేయుడు ఎగురుతున్నట్లు విమానంతోకపై ఉన్న చిత్రం సూచిస్తుంది. దీనికింద ‘ద స్ట్రోమ్ ఈజ్ కమింగ్’ అనే క్యాప్షన్ కూడా ఉంది. హెచ్‌ఏఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిబి అనాథకృష్ణన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా.. మరోసారి హనుమాన్ బొమ్మ విమానంపై ప్రత్యక్షమైంది.

ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో అయిన ఏరో ఇండియా 2023ని ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దాదాపుగా 98 దేశాలకు చెందిన 809 కంపెనీలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఎరో ఇండియా 2023 కార్యక్రమం భారత ఉత్పాదక నైపుణ్యాన్ని, ఆర్మనిర్భర భారత్ కలను సాకారం చేయడాన్ని ప్రదర్శించేందుకే అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఎయిర్‌బస్, బోయింగ్, డస్సాల్ట్ ఏవియేషన్, లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సి రోబోటిక్స్, రోల్స్ రాయిస్ మొదలైన సంస్థలు ఈ షోలో పాల్గొన్నాయి.

Exit mobile version