Amit Shah: కాంగ్రెస్ కొన్ని దశాబ్ధాలుగా దేశాన్ని దోచుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. శుక్రవారం రోజు ఆయన అమేథీ, రాయ్‌బరేలీలో స్మృతి ఇరానీ, దినేష్ ప్రతాప్ సింగ్‌లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వీరిద్దరు కష్టపడి పనిచేస్తున్నారని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. చాలా ఏళ్ల తర్వాత రామ మందిర కల సాకారమైంది, అయితే కాంగ్రెస్ మాత్రం సరైన రీతిలో ప్రాణ ప్రతిష్ట జరగలేదని చెబుతోందని మండిపడ్డారు. వారు అధికారంలోకి వస్తే మందిరానికి తాళం వేస్తారని ఆరోపించారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..
ప్రతిపక్షాలు వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకుని సీఎం చేయాలని, సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని, మమతా బెనర్జీ తన మేనల్లుడిని సీఎం చేయాలని కోరుకుంటున్నారని, రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలు తమకే చెందుతాయని కాంగ్రెస్ భావిస్తోందని, అయితే వంశపారంపర్య రాజకీయాలకు సీటు కేటాయించకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని అమిత్ షా అన్నారు.
ఆర్టికల్ 370కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని, మోడీ జీ దానిని రద్దు చేశారని, దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టారని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) మనదే అని, భయపడేది లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అని, ఇన్నాల్లు దేశాన్ని దోచుకుటున్నారని, అవినీతిపరులందరిని మోడీ సర్కార్ జైల్లో పెడుతుందని చెప్పారు.