Site icon NTV Telugu

Karnataka: గుండెపోటు మరణాలు, ఆస్పత్రులకు పోటెత్తిన జనాలు..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు ‘‘గుండెపోటు’’ భయం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఆకస్మిక గుండెపోటు కారణాలతో మరణించారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో, గుండె సంబంధిత పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మైసూరులోని ప్రముఖ ఆస్పత్రి అయిన జయదేవా ఆసుపత్రికి గుండెపోటు పరీక్షల కోసం వేలాది మంది తరలివస్తున్నారు.

Read Also: Uttam Kumar Reddy: జగన్, కేసీఆర్ భేటీలోనే ఈ నిర్ణయం.. కృష్ణా నదీ జలాలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యంగా, హసన్ జిల్లాలో ఇటీవల పలువురు యువకులు ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఈ వార్తలు మీడియాలో విస్తృతంగా రావడంతో ప్రజలు బయపడుతున్నారు. దీంతోనే ఆస్పత్రులకు పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. అయితే, జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార అలవాట్లతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

గత నెలలో 40 రోజుల వ్యవధిలో హసన్‌లో 23 గుండెపోటు సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతోనే మైసూర్, బెంగళూర్ జయదేవా ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరిగింది. ఈ మరణాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మరణాలను పరిశోధించేందుకు జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కెఎస్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని కమిటీని రాష్ట్రం ఆదేశించింది.

Exit mobile version