UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
- UPI, ఇతర డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలకు వీలు కల్పించే బిల్లు ఆమోదం.
- పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో సవరణలకు లోక్‌సభ ఆమోదం.
- వెంటనే ఛార్జీలు అమల్లోకి రావని స్పష్టత.
- కేంద్రం నోటిఫికేషన్ ద్వారా ఛార్జీలపై నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Charges Bill: యూపీఐ (UPI)తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు (PSPs) ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు UPI సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఇతర ఛార్జీలనున వసూలు చేయడానికి వీల్లేదు. కొత్త సవరణతో ప్రభుత్వం నోటిఫికేన్ ద్వారా ఏ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై ఎంత ఛార్జీలు విధించవచ్చో నిర్ణయించే అధికారం పొందుతుంది.
ప్రస్తుతం RTGS, NEFT వంటి రియల్‌టైమ్ బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు UPI చెల్లింపులు పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం, ఇప్పటికప్పుడే UPI లావాదేవీలపై ఛార్జీలు అమలులోకి రావు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే ఏ లావాదేవీకి ఎంత చెల్లించాలనే వివరాలు తెలుస్తాయి.
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
డిజిటల్ పేమెంట్స్ మౌలిక సదుపాయాలను నిర్వహించేందుకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరుల్ని సమకూర్చడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఊహాగానాల ప్రకారం, వ్యాపారులకు జరిగే అధిక విలువ గల UPI లావాదేవీలపై మాత్రమే MDR అమలు చేసే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య జరిగే (Peer-to-Peer) UPI చెల్లింపులను మినహాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!