Site icon NTV Telugu

New Criminal Bills: మూడు న్యాయ సంహిత బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Criminal Bills Psses In Lok

Criminal Bills Psses In Lok

లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం మూజువాణి ఓటింగ్‌ చేపట్టి ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. . పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘనలపై నిరసనల నేపథ్యంలో 143 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ మధ్య ఈ చట్టాలు ఆమోదించబడ్డాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. వందేళ్ల వరకు ఈ చట్టాలు దేశంలో న్యాయ ప్రక్రియలో ఉపయోగపడతాయని అన్నారు.

Also Read: Lalu Yadav: “ల్యాండ్ ఫర్ జాబ్” స్కామ్.. లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు..

భారతీయత, భారత రాజ్యాంగం, ప్రజల శ్రేయస్సుకు ఈ మూడు కొత్త చట్టాలు ప్రాధాన్యతని ఇస్తాయని నొక్కి చెప్పారు. రేపు(డిసెంబర్ 21) రాజ్యసభలోనూ ఈ మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కొత్త బిల్లులు న్యాయం చేయడానికే అని, శిక్షించడానికి కాదని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యత కల్పించేలా ఈ చట్టాల్లో మార్పులు చేశామన్నారు. కాగా ఈ మూడు చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య (బీఎస్‌).. పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు.

Also Read: Delhi: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ను ప్రకటించిన కేంద్రం.. షమీకి అర్జున అవార్డు

అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో తాజా శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత వాటిలో మార్పు చేసి.. భారతీయ న్యాయ సంహత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టింది. ఇక వీటిని దిగువ సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం ఆశిస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. డిసెంబరు 22 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. అయితే పార్లమెంట్‌లో 143 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ కొనసాగుతున్న వేళ ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించడం గమనార్హం.

Exit mobile version