NTV Telugu Site icon

Rahul gandhi: ప్రతిపక్ష నేతకు లుటియన్స్‌లో కొత్త బంగ్లా కేటాయింపు!

Rahulgandhi

Rahulgandhi

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలోని లుటియన్స్‌లో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లారు. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ఇంకా రెడ్ బుక్ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు..

ఢిల్లీలోని లుటియన్స్‌లోని సున్‌హారీ బాగ్‌లో రాహుల్ గాంధీకి బంగ్లా నంబర్ 5 కేటాయించారు. లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్‌ దగ్గర తుగ్లక్ 12 లేన్‌ను ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీంతో ఆయనకు బంగ్లా నెంబర్ 5 కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ సోదరి ప్రియాంక శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించి వెళ్లారు. ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Double Ismart: డబుల్ ఇస్మార్ట్ క్రేజ్ మామూలుగాలేదుగా.. ఏకంగా అన్ని కోట్లకు డిజిటల్ రైట్స్..

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 99 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కడంతో ఇండియా కూటమి నేతలంతా రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. జూన్ 26న రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 9 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. రాహుల్‌ కేబినెట్ హోదా ర్యాంకు కలిగి ఉంటారు. రాహుల్ గత ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ విజయంతో గెలిచారు. ఇక వయనాడ్ వదులుకుని.. రాయ్‌బరేలీలో కొనసాగుతున్నారు. వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకాగాంధీ పోటీ చేయబోతున్నారు.