NTV Telugu Site icon

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ పదవి కాలం పొడగించిన పార్లమెంట్..

Waqf Bill

Waqf Bill

Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయంత్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వరకు పొడగిస్తూ లోక్‌సభలో గురువారం తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్‌భలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు.

Read Also: Sambhal violence: సంభాల్ హింసలో సంచలన విషయాలు.. ఆడియోలో ఆయుధాలు తేవాలని ఆదేశం..

గత వర్షకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లుని కేంద్రం తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజ్యసభ, లోక్‌సభలోని అధికార, విపక్ష ఎంపీలతో కలిపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిటీ తన నివేదికను పార్లమెంట్‌కి సమర్పించాల్సి ఉంది. ప్రతిపక్షాలతో పాటు పలువురు బీజేపీ ఎంపీలు కమిటీ కాల పరిమితిని పొడగించాలని కోరారు. నిజానికి శీతాకాల సమావేశాల్లో మొదటి వారం చివరి శుక్రవారం తన నివేదికను సమర్పించాల్సి ఉంది.

ప్రస్తుత వక్ఫ్ చట్టంలో బిల్లు ప్రతిపాదించిన సవరణలు ముస్లింల మతపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ సవరణల వల్ల వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకత వస్తుందని, వాటికి జవాబుదారీతనం ఉంటుందని అధికార బీజేపీ పేర్కొంది.