Lok Sabha Election 2024 Exit Poll: ‘‘ఆబ్ కీ బార్ 400 పార్’’ బీజేపీ ఎన్నికల నినాదం, బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీయే కూటమి 400+ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ఎన్నికల ముందు నుంచి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, బీజేపీ 400 కల నెలవేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2024 లోక్‌సభకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 400 స్థానాలు గెలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. బీజేపీని గద్దె దించడానికి, ప్రధాని మోడీని ఓడించేందుకు విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పాటైన ఫలితం కనిపించలేని పరిస్థితి నెలకొంది. ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీ కూటమికి బ్రహ్మరథం పట్టాయి. మూడో సారి ప్రధాని మోడీ అధికారంలోకి వస్తారని అంచనా వేశాయి.
Read Also: Rahul Gandhi: రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకి రాహుల్ గాంధీ లేఖ.. ఎందుకంటే..?
ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగించిందని సర్వేలు స్పష్టం చేశాయి. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో పాటు ఈ సారి దక్షిణాదిన కూడా బీజేపీ సత్తా చాటుతుందని చెప్పాయి. కర్ణాటక, తెలంగాణతో భారీగా సీట్లు సాధిస్తుందని, తమిళనాడు, కేరళలో తన ముద్ర వేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కి, బెంగాల్‌లో మమతా బెనర్జీకి బీజేపీ భారీ షాక్ ఇవ్వబోతోంది. ఈ రాష్ట్రాల్లో అధికార పార్టీలను కాదని బీజేపీ అధిక స్థానాలు గెలుస్తాయని చెప్పింది.
మొత్తం లోక్ సభ స్థానాలు: 543, మ్యాజిక్ ఫిగర్: 272
ఇండియా టుడే:
ఎన్డీయే(బీజేపీ+): 361-401
ఇండియా కూటమి:131-166
ఇతరులు: 8-20
సీఓటర్:
ఎన్డీయే(బీజేపీ+): 353-383
ఇండియా కూటమి:152-182
ఇతరులు: 4-12
టుడేస్ చాణక్య:
ఎన్డీయే(బీజేపీ+): 385-415
ఇండియా కూటమి:96-118
ఇతరులు: 27-45
జన్ కీ బాత్:
ఎన్డీయే(బీజేపీ+): 362-394
ఇండియా కూటమి:141-161
ఇతరులు:10-20
సీఎన్ఎక్స్:
ఎన్డీయే(బీజేపీ+): 371-401
ఇండియా కూటమి:109-139
ఇతరులు: 28-38
ఈటీజీ రీసెర్చ్:
ఎన్డీయే(బీజేపీ+): 358
ఇండియా కూటమి:152
ఇతరులు: 33
