లోక్‌సభ పనిచేసింది 21 గంటలే.. 20 బిల్లులకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం ఆందోళనలు, నిరసనలతో హోరెత్తాయి… ఓవైపు పెగాసస్ వ్యవహారం.. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన.. ఇలా రకరాల సమస్యలపై నిత్యం పార్లమెంట్ ఉభయసభల్లో ఏదో ఒక రచ్చ జరుగుతూనే వచ్చింది… షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా.. లోక్‌సభను ఇవాళే నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్.. ఇక, ఈ సమావేశాల్లో లోక్‌సభ మొత్తంగా 21.14 గంటలు మాత్రమే పనిచేసింది… విపక్షాల నిరసనల కారణంగా ఏకంగా 74 గంటల సమయం వృథా అయ్యింది. జూన్ 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా.. పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది. పెగాసస్‌పై చర్చకు తొలిరోజూ నుంచే పట్టుబడుతూ వచ్చాయి ప్రతిపక్షాలు.. దీంతో సభలో వాయిదాల పర్వం నడిచింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొత్తంగా లోక్‌సభ 17 సార్లు సమావేశం కాగా.. అందులో మొత్తం 96 పనిగంటలు ఉన్నాయి.. కానీ, లోక్‌సభ కేవలం 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసింది. ప్రతిపక్షాల ఆందోళనలతో 74.46 గంటల సమయం వృథా అయిపోయింది. లోక్‌సభ పనిచేసింది కేవలం 22 శాతమేనని వెల్లడించిన స్పీకర్ ఓం బిర్లా.. ఇది చాలా బాధ కలిగించిందని చెప్పారు. మరోవైపు.. విపక్షాల ఆందోళన మధ్యే బిల్లులు ప్రవేశపెడుతూ వచ్చింది ప్రభుత్వం.. ఈ సమావేశాల్లో మొత్తంగా 20 బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి.
Also Read
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!