NTV Telugu Site icon

జూన్ 1 నుంచి ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలిస్తారా? 

కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర అతలాకుతలం అయ్యింది.  రెండు దశల్లో ఆ రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొన్నది.  సెకండ్ వేవ్ సమయంలో ఆ రాష్ట్రం మరింతగా దెబ్బతిన్నది.  ఏప్రిల్ 5 వ తేదీ నుంచి మహారాష్ట్రలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.  కొన్ని రోజులపాటు నైట్ కర్ఫ్యూ, ఆ తరువాత ఉదయం కర్ఫ్యూ అమలు చేసిన సర్కార్, ఒక దశలో 144 సెక్షన్ కూడా అమలు చేసింది.  కేసులు తగ్గకపోవడంతో లాక్ డౌన్ ను అమలు చేసింది.  జూన్ 1 వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండబోతున్నాయి.  జూన్ 1 తర్వాత ఆంక్షలు సడలించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.   రాష్ట్రంలో కరోనా పడకలు, వైద్యసదుపాయాలు, వైద్యులు అందరూ అందుబాటులో ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొంటామని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి తెలియజేశారు.