NTV Telugu Site icon

ఢిల్లీలో లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు

Delhi Lockdown

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో మ‌రోసారి లాక్‌డౌన్ పొడిగించారు.. ఇప్ప‌టికే రెండో విడ‌త‌ల‌గా లాక్‌డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావ‌డం లేదు.. దీంతో.. మ‌రో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంది అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్.. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు న‌మోదు కాగా.. 375 మంది మృతిచెందారు.. ఇలా వ‌రుస‌గా 13వ రోజు 20 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. దీంతో.. మ‌రోవారం పాటు లాక్‌డౌన్ ఆంక్ష‌లు పొడిగించారు.. కోవిడ్ సెకండ్ వేవ్ క‌ట్ట‌డికి మొద‌ట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన ఢిల్లీ స‌ర్కార్.. అయినా ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోవ‌డంతో మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించారు.. ఇంకా.. ప‌రిస్థితిలో ఏ మాత్రం తేడా లేక‌పోవ‌డంతో.. మ‌రో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. దీంతో.. ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఢిల్లీలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండబోతోంది.