Site icon NTV Telugu

Loan app Harassment: లోన్ యాప్ వేధింపులకు ఐటీ ఉద్యోగి బలి.. రుణం చెల్లించినా ఆగని వేధింపులు

Loan App Incident

Loan App Incident

Loan app Harassment.. IT employee forced to die: లోన్ యాప్ ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రుణం చెల్లించానా.. ప్రజలను జలగల్లా పట్టి పీల్చిపిప్పి చేస్తున్నారు. లోన్ యాప్ ఆగడాల వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది బాధితులు తనువుచాలించారు. లోన్ యాప్ నిర్వాహకులు పెట్టే వేధింపులు, అసభ్యకరమైన మాటలు తట్టుకోలేక చాలా మంది లోలోపల కుమిలిపోతున్నారు. చాలా మంది ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా చెన్నైకు చెందిన ఐటీ ఉద్యోగి లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగి లోన్ యాప్ నుంచి రూ. 33,000 అప్పుగా తీసుకున్నారు. దీంతో లోన్ యాప్ ఆపరేటర్లు పదేపదే వేధించడంతో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహలు పదేపదే దుర్భాషలాడుతూ.. బాధితుడి అసభ్య చిత్రాలు విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో మంగళవారం ఉదయం తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని 23 ఏళ్ల నరేంద్రన్ గా పోలీసులు గుర్తించారు.

Read Also: Boys Drowned in Water: ప్రాణాంతకంగా మారిన కోతుల బెడద.. దాడిలో ఇద్దరు మృతి

నరేంద్రన్ పెరుంగుడిలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎంజీఆర్ నగర్ పోలీసుల దర్యాప్తు ప్రకారం.. నరేంద్రన్న లోన్ యాప్ నుంచి 33,000 అప్పుగా తీసుకున్నట్లు అతని కుటుంబీకులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే రుణం చెల్లించిన తర్వాత కూడా లోన్ యాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేటర్లు.. ఎప్పుడూ కాల్ చేస్తూ.. రూ. 33,000 ఇంకా చెల్లించలేదని బెదిరించే వారని కుటుంబీకులు ఆరోపించారు.

అయితే కుటుంబ సభ్యుల నుంచి నరేంద్రన్ రూ.50 వేలు అప్పుగా తీసుకుని లోన్ యాప్ నిర్వాహకులకు చెల్లించినట్లు సమాచారం. అప్పు కట్టిన తర్వాత కూడా నరేంద్రన్ కు లోన్ యాప్ నుంచి మరింత డబ్బు చెల్లించాలని బెదిరించే వారని తెలిసింది. నిర్వాహకులు నరేంద్రన్ ను తిడుతూ.. అతని అసభ్యకరమైన చిత్రాలను కుటుంబం, స్నేహితులకు పంపిస్తామని బెదిరించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. లోన్ యాప్ నిర్వాకులు నరేంద్రన్ స్నేహితులతో పాటు బంధువులకు అనతి గురించి ఫోన్ చేసి తప్పుగా మాట్లాడుతూ.. అప్పు చెల్లించలేదని దుర్భాషలాడారు. దీంతో వేధింపులు భరించలేక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నరేంద్రన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని ఫోన్ లో ఉన్న వివిధ లోన్ యాప్ వివరాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

Exit mobile version