NTV Telugu Site icon

LK Advani: ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు

Advani

Advani

LK Advani: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అపోలో హస్పటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా, అద్వానీ ఆరోగ్య స్థితిపై డాక్టర్లు స్పష్టమైన ప్రకటన ఇంకా వెల్లడించలేదు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న అద్వానీ గత కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నారు. గతంలోనూ అస్వస్థతతో ఆయన ఆస్పత్రిలో చేరినా.. వెంటనే రికవరీ అయ్యారు.

Read Also: Allu Arjun: రేవతి కుటుంబానికి అండగా ఉంటా.. పుష్పరాజ్ హామీ

అయితే, ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యాక ఎల్‌కే అద్వానీ మీడియా ముందు తక్కువగా కనిపించారు. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం వచ్చినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన వెళ్లలేకపోయారు. మొన్న, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అద్వానీ ఇంటికి వెళ్లారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకునే ముందు అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు నరేంద్ర మోడీ.

Show comments