ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. ఇక పర్యటనలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంటారా ఫారెస్ట్‌ను సందర్శించారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ స్వయంగా స్వాగతం పలికి జంతువులను చూపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ వన్యప్రాణుల పరిరక్షణ కేంద్రం వంటారాను స్థాపించారు. అనంత్ అంబానీ ఆహ్వానం మేరకు లియోనెల్ మెస్సీ మంగళవారం వంటారాను సందర్శించారు. ముందుగా సాంప్రదాయ హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివ అభిషేకాలు చేశారు. అనంతరం జంతువులను సందర్శించారు. మెస్సీతో పాటు అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ఉన్నారు. ఇక మెస్సీ వంటారాను సందర్శించినందుకు గుర్తుగా ఫోస్టర్ కేర్ సెంటర్‌లో ఒక సింహం పిల్లకు ‘లియోనెల్’ అనే పేరు పెట్టారు.
దేశంలోనే కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో మెస్సీ పర్యటించారు. ఇక కోల్‌కతా పర్యటనలో గందరగోళం నెలకొంది. ఇక పర్యటన ముగించుకుని వెళ్తుండగా భారత ప్రజల ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నమస్తే ఇండియా! ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాకు ఎంత అద్భుతమైన సందర్శనలు. నా పర్యటన అంతటా ఆత్మీయ స్వాగతం. గొప్ప ఆతిథ్యం, ప్రేమకు ధన్యవాదాలు. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను!’’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
