అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబాల కోసం బీమా నిబంధనలను సడలించింది. మరణ ధృవీకరణ పత్రం స్థానంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ విమానయాన సంస్థలు చెల్లించే ఏదైనా ప్రభుత్వ పత్రంతో పరిహారాన్ని అందిస్తామని వెల్లడించింది. క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరిస్తామని పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ( లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. తమ కాల్‌సెంటర్ / సమీప కార్యాలయాన్నీ సంప్రదించొచ్చని వివరించింది. అలాగే బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేక క్లెయిమ్ సెటిల్‌మెంట్ డెస్క్ ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: Air India Plane Crash: 2000 మందిని రక్షించిన ఎయిర్ ఇండియా పైలట్లు..
ఇదిలా ఉంటే విమాన ప్రమాదంలో చనిపోయిన మృతులకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం ప్రకటించింది. ఈ సాయం బీమా పరిహారంతో ఎలాంటి సంబంధం ఉండదు. బీమా సదుపాయంతోనే రూ.కోటి పరిహారం అందనుంది. ఇదిలా ఉంటే ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరిస్తు్న్నారు. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత మరణ ధృవీకరణ పత్రం ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: King Charles: కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం.. ఎయిరిండియా మృతులకు నిమిషం మౌనం పాటించనున్న చార్లెస్
గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (68) కూడా ఉన్నారు. లండన్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
