NTV Telugu Site icon

Delhi: ఢిల్లీ వైద్యుల అరుదైన సర్జరీ.. గుండెలోంచి నిమ్మకాయంత కణితి తొలగింపు

Haetrt

Haetrt

దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఒక మహిళ గుండెలో నుంచి పెద్ద నిమ్మకాయంత కణితి తొలగించి విజయం సాధించారు. పేషెంట్ పూర్తి ఆరోగ్యం పొందుకోవడంతో క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఈ సర్జరీ అరుదైనదిగా ఆస్పత్రి పేర్కొంది.

రాఖీ (27) అనే మహిళ కార్డియాక్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, సుదీర్ఘమైన తిమ్మిరితో బాధపడుతోంది. దీంతో ఆమె ఇటీవల పట్పర్‌గంజ్‌లోని మాక్స్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అనంతరం ఆమెకు టెస్టులు నిర్వహించగా.. హార్ట్‌లో పెద్ద నిమ్మకాయంత కిణితి కనిపించింది. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న వైద్యులు.. ఆపరేషన్ నిర్వహించగా.. సక్సెస్‌గా గుండెలో ఉన్న కణితిని తొలగించారు. ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో వైద్యులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు

మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని సీటీవీఎస్ కార్డియాక్ సర్జరీ డైరెక్టర్, హెడ్ డాక్టర్ వైభవ్ మిశ్రా మాట్లాడుతూ.. మహిళ గుండెలోని సుమారు పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉన్న కణితిని గుర్తించి.. విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. కణితిలో ఒక భాగం విడిపోయి మెదడుకు ప్రయాణించి.. ఫలితంగా స్ట్రోక్‌ వస్తోందని మిశ్రా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అడ్డంకిని తొలగించినట్లు చెప్పారు. ఓపెన్-హార్ట్ సర్జరీకి బదులు.. డాక్టర్ మిశ్రా నేతృత్వంలోని బృందం కనిష్ట ఇన్వాసివ్ ‘స్కార్‌లెస్’ విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. పక్కటెముకలు కత్తిరించకుండా కుడి ఛాతీలో 5 సెంటీమీటర్ల చిన్న కోత చేసి సర్జరీ చేసినట్లు వెల్లడించారు.

శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ రాఖీ ఆస్పత్రిలో కోలుకుంది. నాల్గవ రోజు డిశ్చార్జ్ అయింది. ఇది వైద్య బృందానికి, రోగికి అద్భుతమైన విజయంగా ఆస్పత్రి పేర్కొంది.

ఇది కూడా చదవండి: Poonam Kaur: ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ ట్వీట్