NTV Telugu Site icon

Leech Found In Nose: మనిషి ముక్కులో “జలగ”.. అరుదైన శస్త్రచికిత్స..

Leech

Leech

Leech Found In Nose: మామూలుగా “జలగ” అంటే చాలా మంది భయపడుతుంటారు. నీటిలో చాలా సేపు గడిపినప్పుడు శరీర భాగాలను అంటిపెట్టుకుని రక్తాన్ని తాగుతుంటుంది. చాలా సందర్భాల్లో మనకు జలగ కుడుతున్న విషయం కూడా తెలియదు. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ముక్కులో జలగ కొన్ని రోజులుగా ఉంటున్న అరుదైన కేసు నమోదైంది. చివరకు విషయం తెలసుకున్న డాక్టర్లు అరుదైన శక్తచికిత్స నిర్వహించి సజీవంగా ఉన్న జలగలను బయటకు తీశారు.

Read Also: Piyush Goyal: ఏకగ్రీవంగా స్పీకర్ను ఎన్నుకుంటే…(వీడియో)

ఉత్తర్ ప్రదేశ్‌ ప్రయాగ్ రాజ్‌కి చెందిన సెసిల్ ఆండ్రూ అనే వ్యక్తి ముక్కు రంధ్రాల్లో చాలా రోజులుగా ఓ జలగ నివాసం ఉంటోంది. బాధితుడు కొండల్లోని ఓ జలపాతంలో ఉన్న సమయంలో జలగ ముక్కులోకి వెళ్లినట్లు కనుగొన్నారు. అతని ముక్కు నుంచి చాలా రోజులుగా రక్తస్రావం అవుతోంది. దీంతో పాటు బాధితుడు ముక్కులో ఏదో కదలికలు అనుభవిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు.

దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్లు సజీవంగా ఉన్న జలగను బయటకు తీశారు. ఇది ముక్కు రంధ్రాల్లో చాలా లోతుగా దాడి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌ను ఆసుపత్రిలోని ఈఎన్‌టీ విభాగంలో సర్జన్ డాక్టర్ సుభాష్ చంద్ర వర్మ నేతృత్వం వహించారు. టెలిస్కోప్ పద్ధతిలో చట్టుపక్కల కణజాలలకు నష్టం జరగకుండా ఆపరేషన్ చేశారు. రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లోని ఒక జలపాతంలో బాధితుడు స్నానం చేశాడు. చెరువులు, నీటి ప్రాంతాల్లో జలగలు బాహ్య శరీర భాగాలకు అంటుకోవడం సాధారణం. కానీ ముక్కులోకి వెళ్లడం చాలా అరుదు. రోగి అదృష్టవశాత్తు మెదడు లేదా కంటికి ప్రయాణించలేదని వైద్యులు తెలిపారు.