Site icon NTV Telugu

BJP: “కేజ్రీవాల్, హేమంత్ సొరెన్ నుంచి నేర్చుకోవాలి”.. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్స్..

Giriraj Sing

Giriraj Sing

BJP: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నైతికతను కోల్పోయారని బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ దుయ్యబట్టారు. ఈడీ అరెస్ట్ చేసే ముందే అతను తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందని, ఈ విషయంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌ని చూసి నేర్చుకోవాలని అన్నారు. కేజ్రీవాల్ ముసుగులో అతను అన్నాహజారేతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నాడని, జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని చట్టం నిషేధించడని కేజ్రీవాల్ అంటున్నాడని ఆదివారం కేంద్రమంత్రి విమర్శించారు.

Read Also: Himanta Biswa Sarma: బాల్య వివాహాలు, బహుభార్యత్వం వదులుకోవాలి.. “మిమా ముస్లిం”లకు సీఎం షరతులు..

ఇలాంటి అనైతిక వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతారాని, కటకటాల వెనక ఉండే వాళ్లు సీఎం అవుతారని బాబా సాహెబ్ అంబేద్కర్ అనుకున్నారా..? అని ప్రశ్నించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై, జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతానని చెప్పడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కట్టర్ ఇమాన్‌దార్’’ అని పిలుచుకున్న కేజ్రీవాల్ కట్టర్ బేమాన్‌గా పిలువబడుతున్నారని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయన భార్య ముఖ్యమంత్రి అయ్యారని, మీరు మీ భార్యను కూడా ముఖ్యమంత్రి చేయాలని కేంద్రమంత్రి సలహా ఇచ్చారు. భూ కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసే ముందే జార్ఖండ్ సీఎం హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఆయన అరెస్టయ్యారు. ఇప్పటికే ఈ కేసులో సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలు కటకటలాల వెనక ఉన్నారు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్, ఇండియా కూటమికి దెబ్బగా మారింది.

Exit mobile version