Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్
- బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం
- బీజేపీలో చేరిన మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్
- బీజేపీకి బూస్ట్‌లాంటిది అన్న కేంద్రమంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఈ సందర్భంగా లియాండర్ పేస్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. తాను ముఖ్యంగా క్రీడలు, యువత అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. బెంగాల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. 1986లో తన క్రీడా ప్రయాణం ప్రారంభించినప్పుడు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయన్నారు. అయినా కూడా ఇంకా అభివృద్ధికి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

లియాండర్ పేస్ చేరికపై సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. బెంగాల్ బీజేపీకి ఇది పెద్ద బూస్ట్ అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పేస్ ప్రచారం చేస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి గత 12 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలే పేస్‌ను ఆకర్షించాయని చెప్పారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పేస్ సాధించిన కాంస్య పతకం దేశానికి గర్వకారణమని కొనియాడారు.
టీఎంసీ నుంచి బీజేపీ వైపు
లియాండర్ పేస్ 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఎప్పుడూ కూడా యాక్టివ్ కనిపించలేదు. ఇటీవల పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా పాత్ర లేకపోవడంతో భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మార్చి 24న కోల్‌కతాలో నితిన్ నబీన్‌ను కలిసిన తర్వాత బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి మంగళవారం కమలం గూటికి చేరిపోయారు.
పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో తెలంగాణ సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య.. కారణమిదేనా?
ఇది కూడా చదవండి: Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?