Lawyer Divorced: అతను ఒక లాయర్.. కానీ తనవద్దకు న్యాయం కోసం వచ్చిన వారివద్ద నుంచి ఒక్క పైసాకూడా తీసుకునే వాడు. విడాకులు కావాలంటూ అతని వద్దకు వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి కలిపి ఇంటికి పంపేవాడు. అలా ఒకటి కాదు రెండు కాదు తన 16 సంవత్సరాల జీవితంలో 138 జంటలను కలిపాడు. కానీ విధి విచిత్రమైనదంటే ఏమో అనుకుంటాము కానీ.. తన భార్య వద్దనుంచి తనకే విడాకుల నోటీస్ రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. పాపం న్యాయవాదికే అన్యాయం అంటే ఇదేనేమో. ఈఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
Read also: Foxconn EV Factory: భారత ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించనున్న ఆపిల్ ఐఫోన్ తయారీ కంపెనీ
అహ్మదాబాద్ హైకోర్టుల ఓ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తన 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో కేసులు వాదించాడు. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన 138 జంటలు విడాకులు తీసుకోకుండా వారిని కలిపాడు. ఇప్పుడు వారు సంతోషంగా జీవిస్తున్నారు. అయితే తన వద్దకు వచ్చిన వారిని విడాకులకు అనుమతించకపోవడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చినా రుసుం వసూలు చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. చివరకు విసిగిపోయిన లాయర్ భార్య తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది. ఇక చేసేది ఏమీ లేక ఆ లాయర్ తన భార్యకు విడాకుడు ఇచ్చాడు. కాగా.. న్యాయవాదికి ఒక కుమార్తె ఉంది. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో కూతురు తల్లి వద్దే ఉంటోంది. ఆమె లా చదువుతోంది. విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆమె తన తల్లి వద్దే ఉండిపోయింది.
అయితే విడాకుల తర్వాత తన తండ్రి వద్దే ఉంటానని చెప్పింది. తన తండ్రి తనకు రోల్ మోడల్ అని చెప్పింది. ఆమె కోరిక మేరకు కోర్టు కూడా తండ్రి వద్దే ఉండేందుకు అనుమతించింది. కానీ ఈ కేసులో విడాకులు తీసుకున్న భార్య మాత్రం భర్త నుంచి ఎలాంటి భరణం తీసుకోకపోవడం గమనార్హం. విడాకుల కోసం తన వద్దకు వచ్చిన వారి నుంచి న్యాయవాది ఎలాంటి రుసుము తీసుకోకుండా ఉండటానికి ఓ విచిత్రమైన కారణం ఉంది. తన సమీప బంధువు గతంలోనే విడాకులు తీసుకున్నారని తెలిపారు. కానీ.. అప్పటి నుంచి ఏ జంట తన వద్దకు వచ్చి విడాకులు అడిగినా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చాడు. అంతే కాకుండా భార్యాభర్తలు కలిసి ఉండేందుకు విడాకులకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేపట్టారు. ఈ 16 ఏళ్ల కెరీర్‌లో 138 జంటలను ఒప్పించి విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నాడు. కానీ భార్యను ఒప్పించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
Foxconn EV Factory: భారత ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించనున్న ఆపిల్ ఐఫోన్ తయారీ కంపెనీ
