NTV Telugu Site icon

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తర్వాతి టార్గెట్ పప్పు యాదవ్..

Pappu Yadav

Pappu Yadav

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు మరొకర్ని టార్గెట్ చేసింది. బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌కి బెదిరింపులు జారీ చేసింది. పప్పూ యాదవ్‌కి కాల్ చేసిన ఒక వ్యక్తి.. ‘‘నీ కదలికల్ని నిశితంగా పరిశీలిస్తు్న్నాము. సల్మాన్ ఖాన్‌కి దూరంగా ఉండకపోతే చంపేస్తాము’’ అని బెదిరించాడు. అహ్మదాబాద్ సబర్మతి జైలులో ఉన్న బిష్ణోయ్, సిగ్నల్ జామర్లు డిసెబుల్ చేయడానికి గంటకు రూ. 1 లక్షల చెల్లిస్తున్నారని, పప్పూ యాదవ్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని కాల్‌లో ఆగంతకుడు చెప్పాడు.

Read Also: Wayand Polls: ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై కీలక ప్రకటన

ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ని కాల్చి చంపింది. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్‌కి పప్పూ యాదవ్ బహిరంగ సవాల్ విసిరారు. తనకు అనుమతినిస్తే 24 గంటల్లో బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్‌ని కూల్చేస్తానని ప్రకటించాడు. కాలర్ పప్పూ యాదవ్‌ని బెదిరిస్తూ.. ‘‘ ఈ వ్యాఖ్యలు నేను చేయలేదు, మీడియా సృష్టించిందని ‘‘భాయ్’’కి చెప్పు. ఈ మ్యాటర్‌ని సెటిల్ చేసుకోండి. నేను నిన్ను అన్నయ్యగా భావించాను, కానీ నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. తిరిగి కాల్ చేయండి, నేను మిమ్మల్ని భాయ్(లారెన్స్ బిష్ణోయ్)తో కనెక్ట్ చేస్తానను’’ అని ఆడియో సందేశంలో వినవచ్చు. ఈ బెదిరింపులపై బీహార్ డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని పప్పు యాదవ్ కోరారు.

Show comments