Site icon NTV Telugu

Indians Deportation: ఈ ఏడాది భారతీయులు బహిష్కరణకు గురైంది ఏ దేశం నుంచంటే..! వివరాలు ఇవే!

Us

Us

ఈ ఏడాది ఆయా దేశాల నుంచి భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. చాలా మంది అమెరికా నుంచి ఎక్కువ మంది బహిష్కరణకు గురైనట్లు వార్తలు వచ్చాయి. తాజా లెక్కలను బట్టి చూస్తే అదంతా ఒట్టిదని తేలిపోయింది. అమెరికా నుంచి కేవలం 3,414 మంది బహిష్కరణకు గురైతే సౌదీ అరేబియా నుంచి ఏకంగా 11,000 మంది బహిష్కరణకు గురైనట్లు నివేదిక తెలిపింది.

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభకు సమర్పించిన నివేదికతో వివరాలు వెల్లడిలోకి వచ్చాయి. ఇటీవల అందించిన డేటా ప్రకారం 2025లో దాదాపు 24,600 మంది భారతీయులను 81 దేశాలు స్వదేశానికి పంపించాయని పేర్కొంది.

వివరాలు ఇలా..
అమెరికా నుంచి 3,414 మంది బహిష్కరణ
సౌదీ అరేబియా నుంచి 11, 000 మంది బహిష్కరణ
హుస్టన్ నుంచి 234 మంది బహిష్కరణ

మయన్మార్ (1,591), మలేషియా (1,485), యూఏఈ (1,469), బహ్రెయిన్ (764), థాయిలాండ్ (481), కంబోడియా (305) ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో వీసా లేదా నివాస కాలం ముగిసిన తర్వాత ఉండడం, చెల్లుబాటు అయ్యే పర్మిట్లు లేకపోవడంతో బహిష్కరణకు గురైనట్లు తెలిపింది. ఇక విద్యార్థులు కూడా బహిష్కరణలకు గురయ్యారు. యూకే నుంచి అత్యధికంగా 170 మంది ఉన్నారు. తర్వాత ఆస్ట్రేలియా (114), రష్యా (82), US (45) ఉంది విద్యార్థులు ఉన్నారు.

Exit mobile version