NTV Telugu Site icon

Lalu Prasad Yadav: విషమంగా ఆర్జేడీ ఛీఫ్ పరిస్థితి!.. కదలికలు లేని స్థితిలో లాలూ..

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ యాద‌వ్ క‌ద‌ల్లేక‌పోతున్నార‌ని ఆయ‌న త‌న‌యుడు, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ చెప్పారు. ఇటీవ‌ల ఆదివారం త‌న ఇంట్లో మెట్లపై నుంచి లాలూ కింద ప‌డిపోవ‌డంతో కుడి భుజంతోపాటు మూడు చోట్ల ఫ్రాక్చరైంది. దీంతో కండ‌రాలు, కీళ్లు ప‌ట్టేసి స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని తేజ‌స్వి చెప్పార‌ని ఓ వార్తా సంస్థ తెలిపింది. అందువ‌ల్ల ఎక్కువ‌గా క‌ద‌ల్లేక‌పోతున్నార‌ని తెలిపారు. త్వర‌లో కోలుకుంటార‌ని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. తామంతా ఆస్పత్రిలో ఆయ‌న వెంటే ఉన్నామ‌ని వివ‌రించారు.

కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే.. కండరాలు, కీళ్లు పట్టేయడంతో లాలూ శరీర కదలికలు అతి స్వల్పంగా ఉన్నాయంటూ ఆయన తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ వెల్లడించారని ఓ వార్తాసంస్థ తెలిపింది. తొలుత పాట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన లాలూను.. మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. నాన్న వైద్య అవ‌స‌రాలు ఎయిమ్స్ వైద్యుల‌కు తెలుసున‌ని, అందుకే ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చామ‌ని తేజ‌స్వి యాద‌వ్ చెప్పారు. భుజానికి గాయమైన నేపథ్యంలో.. దిల్లీ వైద్యుల సలహా ప్రకారం ముందుకెళ్తామని తేజస్వీ తెలిపారు.

PM Narendra Modi: జాతీయ విద్యా విధానంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

`లాలూ ఆరోగ్యం కాసింత మెరుగు ప‌డింది. ఆయ‌న క్షేమం కోసం ప్రార్థించండి, త్వర‌లో ఇంటికి త‌రిగి వ‌స్తారు` అని లాలూ స‌తీమ‌ణి ర‌బ్రీదేవి చెప్పారు. లాలూ ప్రసాద్ యాద‌వ్ ఆరోగ్యం క్షీణిస్తున్నద‌ని, కిడ్నీ మార్పిడికి సింగ‌పూర్‌కు వెళ్లేందుకు అనుమ‌తించాల‌ని ఇటీవ‌ల కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. భుజానికి గాయం కావ‌డంతో ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యుల స‌ల‌హా మేర‌కు నిర్ణయం తీసుకుంటామ‌ని తేజ‌స్వి యాద‌వ్ తెలిపారు. మ‌రోవైపు ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తేజ‌స్వి యాద‌వ్‌కు ఫోన్ చేసి లాలూ ఆరోగ్య ప‌రిస్థితిపై వాక‌బు చేశారు. భుజానికి గాయమైన నేపథ్యంలో.. దిల్లీ వైద్యుల సలహా ప్రకారం ముందుకెళ్తామని తేజస్వీ తెలిపారు. బుధవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్.. పట్నా ఆసుపత్రిలో లాలూను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను వాకబు చేశారు.