ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసింది. పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లోని బంగ్లాలో 19 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లాలూ కుటుంబానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఖాళీ చేసేందుకు నిరాకరించింది. ముఖ్యమంత్రులుగా పని చేసిన తమకు బంగ్లాను కేటాయించారా? అని ఆర్జేడీ నిలదీసింది. పైగా లాలూ ప్రసాద్‌కు అనారోగ్యం కారణంగా ఇదే బంగ్లా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం నిరాకరించింది. మొత్తానికి గురువారం సాయంత్రం నుంచి బంగ్లాను ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. వస్తువులు తరలిస్తున్న వాహనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Surat Video: 10వ అంతస్తు నుంచి జారిపడ్డ వ్యక్తి.. ప్రాణాలతో ఎలా బయటపడ్డాంటే..!
ప్రస్తుతం రబ్రీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 39 హోర్డింగ్ రోడ్‌లో కొత్తగా బంగ్లాను కేటాయించారు. అయితే ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి జనవరి 14నే ఖాళీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుం కొన్ని వస్తువులను తరలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: CJI Suryakant: ఢిల్లీ కాలుష్యాన్ని వారు పరిష్కరించగలరు.. జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్య
