NTV Telugu Site icon

ED: లాలూ అక్రమ సంపాదన రూ.600 కోట్లు.. రూ.150 కోట్ల భవనాన్ని 4 లక్షలకే కొనుగోలు..

Lalu Yadav

Lalu Yadav

lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈడీ లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ రైడ్స్ లో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, పాట్నా, ముంబాయ్, రాంచీల్లోని పలు ప్రదేశాల్లోని 25 చోట్ల దాడులు జరిగాయి. ఈ సోదాల్లో మొత్తం రూ. 600 కోట్ల అక్రమార్జన బయటకి వచ్చినట్లు ఈడీ శనివారం వెల్లడించింది. ఇందులో రూ.350 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు బినామీల ద్వారా రూ. 250 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు తేలిపింది. వీటితో పాటు 540 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ. 1.25 కోట్ల విలువైన 1.5 కేజీల బంగారు అభరణాలు, 1900 అమెరికన్ డాలర్లతో కలిపి రూ.1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Electric car: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి 2024లో ఎలక్ట్రిక్ కారు.. ఒక్క చార్జ్‌తో 1000 కి.మీ మైలేజ్..!

రైల్వే మంత్రి ఉన్న సమయంలో లాలూ నిరుద్యోగుల నుంచి అతి తక్కువ ధరలో భూములను సొంత చేసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్నే ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ భూముల విలువ రూ. 250 కోట్లుగా ఉందని ఈడీ తేల్చింది. ఇందుకు సంబంధించిన బినామీలు, షెల్ కంపెనీలను ఈడీ గుర్తించింది. ఇదిలా ఉంటే సౌత్ ఢిల్లీలోని రూ. 150 కోట్ల నాలుగంతస్తుల భవనాన్ని కేవలం రూ. 4 లక్షలకే కొనుగోలు చేసినట్లు తేలింది. ఇది ఏబీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయింది. ఈ కంపెనీ బీహార్ డిఫ్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలో నడుస్తోంది.

అక్రమంగా సంపాదించిన డబ్బును చెలామణిలోకి తేవడానికి ముంబైకి చెందిన నగలు, ఆభరణాలు బిజినెస్ సంస్థలను ఉపయోగించినట్లు ఈడీ కనుక్కుంది. ప్రస్తుతం ఈ ఢిల్లీలోని భవనం ఓ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయింది. కానీ దీంట్లో తేజస్వీ కుటుంబం నివాసం ఉంటోంది. ఇదిలా ఉంటే రైల్వే గ్రూప్-డి ఉద్యోగుల నుంచి లాలూ రూ. 7.5 లక్షలకు నాలుగు ప్రావర్టీలను కొనుగోలు చేయగా.. వాటిని ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ అబూ దోజానాకు రూ. 3.5 కోట్లకు విక్రయించినట్లు తేలింది. లాలూ హయాంలో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో వివిధ రైల్వే జోన్లలో నియమితులైన ఉద్యోగుల్లో 50 శాతం మంది లాలూ కుటుంబ సభ్యుల నియోజకవర్గాలకు చెందిన వారే. ప్రస్తుతం ఈ కేసులో లాలూ కుటుంబసభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరిపై విచారణ జరుగుతోంది.

Show comments