Site icon NTV Telugu

Lakhimpur Kheri: లఖీంపూర్ మరణాలు కంటిన్యూ.. మరో బాలికపై దాడి.. మృతి

Lakhimpur Kheri

Lakhimpur Kheri

Lakhimpur Kheri girl dies of assault: ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల లఖీంపూర్ ఖేరీ జిల్లాలో ఇద్దరు దళిత బాలికపై అత్యాచారం చేసి, చెట్టుకు ఉరేసి చంపారు. ఈ ఘటన మరవకు ముందే మరో బాలికపై దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. బాలిక చికిత్స పొందుతూ మరణించింది. నిందితులిద్దరూ కూడా బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని భీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చికిత్స పొందుతూ..భీజూ సీహెచ్‌సీలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులను సలీముద్దీన్, ఆసిఫ్ గా గుర్తించారు. నిందితులు, బాధిత బాలిక అదే గ్రామానికి చెందిన వారు. బాలిక తన గ్రామం మూసేపూర్: లో తన ఇంటి వద్ద కూర్చుని ఉన్నప్పుడు.. వీరిద్దరు ఆమెపై దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలైన బాలికకు చికిత్స తీసుకుంటున్న క్రమంలో చనిపోయింది.

Read Also: Jharkhand: లోన్ రికవరీ ఏజెంట్ల దారుణం.. గర్భిణిపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్య

నిందితులపై ఐపీసీ 323, 504,506,304 ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. బాధిత కుటుంబ సభ్యులు ఔట్ పోస్ట్ ఇంఛార్జ్ సునీల్ నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డ చనిపోయిందని కుటుంబీకులు ఆరోపణలు చేశారు. దీంతో ఆయన్ను ఎస్పీ సంజీవ్ సుమన్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. బాధితురాలి కుటుంబం నిందితులపై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ఇటీవల లఖీంపూర్ జిల్లాలో ఇద్దరు దళిత బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, అత్యాచారం చేసి, చెట్టుకు ఉరేసి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు పారిపోవడానికి ప్రయత్నించడంతో తుపాకీతో కాలి కింద కాల్చి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మరో బాలిక ఘటన వెలుగులోకి వచ్చింది.

Exit mobile version