Love Jihad: హిందూ అమ్మాయిలే టార్గెట్, పట్టుబడిన ‘‘లవ్ జిహాద్’’ గ్యాంగ్..
- ఉత్తర్ ప్రదేశ్‌లో పట్టుబడిన ‘‘లవ్ జిహాద్’’ ముఠా..
- హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ బలవంతపు మతమార్పిడి..
- అమ్మాయి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన గ్యాంగ్..
- ఇద్దరు మహిళలతో సహా 8 మంది అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Jihad: ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. సునీల్ వర్మ అనే వ్యక్తి, తన 19 ఏళ్ల కుమార్తెను ప్రలోభపెట్టి అమృత్సర్ తీసుకెళ్లారని, అక్కడ ఆమెను బలవంతంగా మతం మార్చి, దాచిపెట్టారని ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈ అరెస్టులు జరిగాయి.
ఫిర్యాదు రావడంతో స్థానిక పోలీసులు, సైబర్ సెల్ సంయుక్తంగా ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బాలికను సురక్షితంగా రక్షించారు. పోలీసులు రెండు ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒకదాంట్లో ఆమె పేరు నేహా శర్మగా, మరొక దాంట్లో మతం మార్చిన తర్వాత పర్వాణి ఖాటూన్ అనే పేరుతో ఉంది. 11 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: Tariff Deadline: ‘‘ఆగస్టు 1 డెడ్ లైన్’’.. సుంకాలపై అమెరికా స్పష్టీకరణ..
ఈ కేసుపై ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘మహువా బుజుర్గ్కు చెందిన సునీల్ వర్మ తన కుమార్తెను బలవంతంగా మతం మార్చారని ఫిర్యాదు చేశారు. ఇది ఒక వ్యవస్థీకృత నెట్వర్క్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశాము. అషిక్ అన్సారీ, ఇంతియాజ్, మొహమ్మద్ సహాబ్, మరికొందరు ఆమెను మతం మార్చి కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత దాచిపెట్టారు. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని చెప్పారు.
అరెస్టు చేసిన వ్యక్తులను తౌఫిక్ అన్సారీ, ఆషిక్ అన్సారీ మరియు అతని కుమారుడు ఇంతియాజ్, మొహమ్మద్ సహబ్ అన్సారీ, జీషన్ ఖమర్, మజార్ మరియు ఇద్దరు మహిళలు, కైజర్ జహాన్, ఫాతిమాగా గుర్తించారు. ముఖ్యంగా హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ మతం మార్చుతున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా బాధితురాలని చాలా కాలంగా వెంబడించి, భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రలోభాలకు గురి చేసి మోసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి తౌఫిక్ అన్సారీ కొన్ని వీడియోలు, రికార్డును ఉపయోగించాడు. కైజర్ జహాన్, ఫాతిమా ఆ బాలికను మానసికంగా మోసగించడంలో కీలక పాత్ర పోషించారని, ఆమె మతపరమైన విషయాలను చూపించి ఆమె నమ్మకాలను ప్రభావితం చేశారని ఆరోపించారు. పరారీలో ఉన్న ఇతర ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!