స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కునాల్ కమ్రా పిటిషన్ వేశారు.
ఇటీవల ఏక్‌నాథ్ షిండేపై కునాల్ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. కునాల్ కమ్రా ప్రోగ్రామ్ నిర్వహించిన స్టూడియో, క్లబ్‌ను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆయనపై పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో కునాల్ కమ్రాను అరెస్ట్ చేసేందుకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు కునాల్ స్పందించలేదు. తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు వరుస షాక్‌లు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!
ఇదిలా ఉంటే ఇటీవల ముంబై పోలీసులు.. కునాల్‌ను ఫోన్ సంప్రదించగా క్షమాపణ చెప్పనని బదులిచ్చారు. ఒకవేళ న్యాయస్థానాలు కోరితే మాత్రం క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. ఇక కునాల్ వ్యాఖ్యలపై షిండే స్పందిస్తూ.. న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తుచేశారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నారు. అయినా కూడా శివసేన కార్యకర్తల దాడిని మాత్రం సమర్థించనన్నారు.
ఇది కూడా చదవండి: AIMIM : ఈద్ ప్రార్థనలపై మాటల యుద్ధం.. రోడ్డు మీద నమాజ్ చేస్తామన్న ఎంఐఎం నేత…