Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..

  • జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదుల కాల్పులు.
  • అఖ్రాన్ సమీపంలో జరిగిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలు.
  • బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారీ.
Jammu Kashmir Terror Attack

Jammu Kashmir Terror Attack

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా అఖ్రాన్ సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద దాడిని జవాన్లు తిప్పికొట్టారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. నకా వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మోటార్ సైకిల్‌‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారు. గాయపడిన జవాన్లను వెంటనే అనంత్‌నాగ్ జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత కుల్గాం జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.