కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్న ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఒక వైపు ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోంది. అయినా విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంకో వైపు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. విపక్ష పార్టీలన్నీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Weight Loss Tips: బరువు తగ్గడం కోసం చపాతీలు తింటున్నారా.. రోజూ ఎన్ని తినాలంటే..?
ఇటీవల మమత న్యాయం కోసం గొంతెత్తారు. ముఖ్యమంత్రే స్వయంగా ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఈ ప్రత్యేక సెషన్‌ను నిర్వహించనున్నారు. సమావేశాల్లో భాగంగా రెండోరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ బిమన్ బెనర్జీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Assam: ముస్లిం వివాహాలు-విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం..
ఈ బిల్లు గురించి బుధవారం మమతా బెనర్జీ మాట్లాడారు. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని మమత స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న చట్టాలను సవరించి, అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్‌భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు. అత్యాచార నిందితులకు మరణ శిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్ర స్థాయిలో తృణమూల్ పార్టీ ఉద్యమం చేపడుతుందని ప్రకటించారు.
