NTV Telugu Site icon

Kolkata doctor case: వైద్యురాలి హత్యాచారం.. నిందితుడి గురించి వెలుగులోకి సంచలన విషయాలు..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata doctor case: కోల్‌కతాలో పీజీ చదువుతున్న ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌‌ని కదుపేస్తోంది. ఆర్‌జి కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్‌‌పై రేప్ చేసి, హత్య చేసిన ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిని 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ, వామపక్షాలు అధికార తృణమూల్, సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఈ హత్యలో ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిందితుడికి మరణశిక్ష పడేలా సీఎం మమతా హమీ ఇచ్చారు.

Read Also: Twist in Marriage: వరుడు తాళి కట్టే సమయంలో ప్రియురాలి ఎంట్రీ.. చివరకి ఏమైందంటే..?

ఇదిలా ఉంటే, విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు తెలుస్తున్నాయి. సంజయ్ రాయ్‌కి అప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు తెలిసింది. అయితే, ఇతడి ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు ఇతడిని విడిచి వెళ్లారు. అసభ్య ప్రవర్తన కారణంగానే వారంతా రాయ్‌ని వదిలేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. నాలుగో భార్య గతేడాది క్యాన్సర్‌తో మరణించినట్లు వెల్లడించారు. నిందితుడు తాగిన మత్తులో తరుచూ అర్థరాత్రి ఇంటికి వచ్చేవాడని ఇరుగుపొరుగు వారు పేర్కొన్నారు.

అయితే, సంజయ్ రాయ్ తండ్రి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకుపై వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. పోలీసుల ఒత్తిడి మేరకు నేరం చేసినట్లు అంగీకరించాడని ఆరోపించారు. నా కొడుకు నిర్దోషి అని ఆమె అన్నారు. 31 ఏళ్ల వైద్యురాలి పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె కళ్లు, నోరు నుంచి రక్తస్రావం జరిగింది. బాధితురాలి ప్రైవేట్ భాగాల నుంచి కూడా రక్తం కారినట్లు తేలింది. ఆమె బొడ్డు, ఎడమ కాలు, మెడ, కుడి చేతి ఉంగరపు వేలు, పెదవులపై గాయాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

Show comments