Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం- హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ఉపయోగించిన బైక్ కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ చేయబడిందని తేలింది. అయితే, నిందితుడు కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా కొనసాగుతున్నాడు. ఇక, నేరం జరిగిన రోజు ఉత్తర కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాలను సందర్శించడానికి ఈ బైక్ ను ఉపయోగించినట్లు వెల్లడైంది. నిందితుడు సంజయ్ రాయ్ మద్యం మత్తులో 15 కిలో మీటర్ల దూరం పాటు బైక్‌ను నడిపినట్లు తెలుస్తుంది.
Read Also: Bigg BossTelugu 8: బిగ్‌బాస్ 8 ప్రసార తేదీ వచ్చేసింది.. హోస్ట్‌గా కింగే!
అయితే, కోల్‌కతా సీనియర్ పోలీసు అధికారులతో సంజయ్ రాయ్‌కి ప్రోత్సాహకాలు అందించిన అధికారులపై సరైన చర్యలు తీసుకున్నారా అనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. కాగా, ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. ఇది 2014లో ప్రస్తుత కమిషనర్ పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తుంది. అత్యాచారం- హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది.
