Site icon NTV Telugu

మ‌మ‌తా స‌ర్కార్‌కు హైకోర్ట్ షాక్…

ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్‌కు ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  ఈ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది.  ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్రంలో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు అనేకం చోటుచేసుకున్నాయి.  ఈ సంఘ‌ట‌న‌ల‌కు ప్ర‌ధాన‌కార‌ణం ప్ర‌భుత్వ‌మే అని, మ‌మ‌త స‌ర్కార్ అండ‌దండ‌ల‌తో తృణ‌మూల్ గూండాలు రెచ్చిపోతున్నార‌ని గ‌తంలో ప్ర‌తిప‌క్షస్థానంలో ఉన్న బీజేపీ ఆరోపించింది.  

Read: ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు!

బెంగాల్ గ‌వ‌ర్న‌కు ఫిర్యాదు కూడా చేశారు.  దీనిపై గ‌వ‌ర్న‌ర్ ఇప్ప‌టికే సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటే, ఎన్నిక‌ల త‌రువాత హింస‌పై కోర్టు ఆర్డ‌ర్ ను రీకాల్ చేయాల‌ని మ‌మ‌తా సర్కార్ హైకోర్టును కోరింది.  అయితే, ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.  హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ఎన్‌హెచ్ఆర్‌సీలో విచార‌ణ కొన‌సాగుతుంద‌ని హైకోర్ట్ పేర్కొన్న‌ది.  

Exit mobile version