NTV Telugu Site icon

Kolkata Doctor Rape Case: ట్రైనీ డాక్టర్ కేసులో మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారికి సీబీఐ కస్టడీ పొడిగింపు

Kolkata

Kolkata

Kolkata Doctor Rape Case: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ అధికారి అభిజిత్ మోండల్‌లకు మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆగస్టు 9న ఆసుపత్రిలోని సెమినర్ హాల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వారిని అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆరోపణలపై ఘోష్‌ను అరెస్టు చేయగా, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేసినందుకు మోండల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. సందీప్ ఘోష్, మోండల్ విచారణకు సహకరించకపోవడంతో కస్టడీని పొడిగించాలని సీబీఐ కోర్టును వేడుకుంది.

Read Also: Lunar Eclipse 2024: నేడే సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం..

ఇక, వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో సందీప్ ఘోష్, మోండల్ ప్రమేయంపై ఉన్నట్లు ఇప్పటి వరకు సీబీఐ ఎలాంటి ఆధారాలను కనుగొనలేదని.. అయితే వారి కాల్ వివరాలు, కొన్ని నంబర్‌లకు అనేకసార్లు కాల్‌లు చేసినట్లు కోర్టుకు తెలిపింది కేంద్ర విచారణ సంస్థ. ఇక, వారిద్దరి రిమాండ్‌ను సీటీ కోర్టు సెప్టెంబర్ 20 వరకు పొడిగింంది. ఈ కేసులో కోల్‌కతా పోలీసులు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. మాజీ ప్రిన్సిపాల్ ఘోష్ పాత్రతో సహా ఈ కేసులో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని, ఆసుపత్రి అధికారుల తీరుపై విచారణ చేయాలని అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. కలకత్తా హైకోర్టు ఆగస్టు 13వ తేదీన సిట్ నుంచి కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. అలాగే, ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.