NTV Telugu Site icon

kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ హత్యచార కేసు.. మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్‌కి సీబీఐ సమన్లు..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

kolkata doctor case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలి మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున కాలేజ్ సెమినార్ హాలులో కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో ఆమె పెదవులు, గొంతు, ముఖంపై గాయాలు ఉండటమే కాకుండా ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయినట్లు నివేదించింది. ఇదే కాకుండా ఆమె శరీరంలో 150 మిల్లిగ్రాముల వీర్యం గణనీయమైన స్థాయిలో కనిపించినట్లు పోస్టుమార్టం నివేదిక గురించి బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో వెల్లడించారు. ఇది ముమ్మాటికి సామూహిక అత్యాచారామనే అని వారు ఆరోపించారు.

Read Also: Nandamuri Balakrishna: బాలయ్యతో మాములుగా ఉండదు.. జిమ్ లో ఏం చేస్తున్నాడో చూశారా?

ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడంతో ఈ కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తి తన విద్యార్థుల భద్రత విషయంలో ఉదాసీనంగా ఉండటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌జీ కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్‌ సుదీప్ ఘోష్‌ని అక్కడ నుంచి తొలగించి వేరే కాలేజీలో ఇదే స్థాయిలో నియమించడంపై హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తి చేస్తూ.. అతడిని సెలవులపై పంపాల్సిందిగా కోరింది. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన విచారణలో మెడికల్ కాలేజీపై జరిగిన విధ్వంసంపై రాష్ట్రపోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ, మాజీ ప్రిన్సిపాల్ సుదీప్ ఘోష్‌కి విచారణ కోసం హాజరు కావాల్సిందిగా సమన్లు జారీచేసింది.