NTV Telugu Site icon

Kolkata Doctor Case: ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నిందితుడిని కాపాడేందుకు కోల్‌కతా పోలీస్ ప్రయత్నం..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే సీబీఐ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని రక్షించేందుకు సీనియర్ కోల్‌కతా పోలీస్ ప్రయత్నించాడని సీబీఐ ఆరోపించినట్లు తెలిసింది. పోలీస్ అధికారి అభిజిత్ మోండల్ కేసు నుంచి నిందితుడు సంజయ్ రాయ్‌ని తప్పించేందుకు ప్రయత్నించాడు.

ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, సాక్ష్యాలు నాశనం అయ్యే చేశాడనే ఆరోపణలపై తాలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ అభిజిత్ మోండల్‌ని, డాక్టర్ సందీప్ ఘోష్‌ని సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. సందీప్ ఘోష్ ఆగస్టు 09 ఉదయం 10.03 గంటలకు ఆర్‌జీ కర్ సెమినార్ హాలులో ట్రైనీ డాక్టర్ పాక్షిక నగ్న మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీస్ అధికారి మోండల్‌కి సమాచారం అందించినట్లు సీబీఐ అధికారులు ఆరోపించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడంతో విఫలమయ్యారు. ఒక గంట తర్వాత ఉదయం 11 గంటలకు వచ్చారు. తాలా పోలీస్ స్టేషన్, ఆర్ జీ కర్ హాస్పిటల్ మధ్య కేవలం 10 నిమిషాల దూరం మాత్రమే ఉంది. ఈ రెండు ఉత్తర కోల్‌కతాలోనే ఉన్నాయి.

పోలీస్ రికార్డుల్లో అభిజిత్ మోండల్ జనరల్ డైరీని నమోదు చేయడంతో తప్పుడు సమాచారం ఉందని అధికారులు ఆరోపించారు. అంతకముందు మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించినప్పటికీ డాక్టర్ మృతదేహం “చెస్ట్ మెడిసిన్ సెమినార్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉందని” అందులో పేర్కొన్నారు. ఆస్పత్రి అధికారులు, ఇద్దరు తెలియని వ్యక్తుల కుట్రలో భాగంగా సాధారణ డైరీ ఎంట్రీలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని పేర్కొన్నారని సీబీఐ అనుమానిస్తోంది. ఇదే కాకుండా నేర స్థలాన్ని భద్రపరచడం, సాక్ష్యాలు నాశనం కాకుండా చూడటంలో పోలీసులు విఫలమైనట్లు చెప్పారు. అనధికారిక వ్యక్తులు సంఘటన స్థలంలో సాక్ష్యాలు పాడయ్యేలా అనుమతించారని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఏకంగా 14 గంటలు జాప్యం చేశారని దర్యాప్తులో తేలింది.

Read Also: Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైల్ పేరు మారింది.. ఇకపై ఇలా పిలవాలి..

బెంగాల్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (BNSS) నిబంధనల ప్రకారం నేరం జరిగిన ప్రదేశం నుండి వ్యాసాలు, ఎగ్జిబిట్‌లు మరియు బయోలాజికల్ శాంపిల్స్‌ను సీలింగ్ చేసే పూర్తి ప్రక్రియ యొక్క వీడియోగ్రఫీని నిర్ధారించడంలో అభిజిత్ మోండల్ విఫలమయ్యారని ఆరోపించారు. రెండోసారి పోస్టుమార్టం కోసం ఆమె కుటుంబం డిమాండ్ చేసినప్పటికీ, వైద్యురాలి శవాన్ని హుటాహుటిన, హడావుడిగా దహనం చేయడంనికి అనుమతించారని సీబీఐ ఆరోపించింది.

ఇదే కాకుండా, నిందితుడు సంజయ్ రాయ్ దొరికిన తర్వాత అతడి బట్టలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో మోండల్ రెండు రోజులు ఆలస్యం చేసినట్లు తేలింది. అత్యాచారం-హత్యకు సంబంధించిన దర్యాప్తుని పక్కదారి పట్టించే ఉద్దేశంతోనే నేరపూరిత కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. సీబీఐ రిమాండ్ నోట్‌లో సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ టెస్ట్ నివేదికను ప్రస్తావించింది. ఇది ఆగస్టు 09 ఉదయం 10.03 గంటల నుంచి అభిజిత్ మోండల్‌తో ఘోష్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వెల్లడైంది. అయితే, ఘోష్ అత్యాచారాన్ని పక్కదారి పట్టించాలని చూశాడు. 9.58 గంటలకే మృతదేహం గురించి విషయం తెలిసినప్పటికీ, మోండల్ మాదిరిగానే, ఘోష్ కూడా ఆస్పత్రికి వెళ్లలేదు.

అంతకుముందు, కోల్‌కతా పోలీసులు ఆమె మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయడం ద్వారా కేసును అణిచివేసేందుకు ప్రయత్నించారని మరియు వారికి లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించారని డాక్టర్ కుటుంబం పేర్కొంది. తన కుమార్తె మృతదేహాన్ని శవపరీక్ష కోసం తీసుకువెళుతుండగా తమను గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండేలా చేశారని ఆమె తండ్రి తెలిపారు. శ్మశానవాటికలో మరో మూడు మృతదేహాలు ఉన్నప్పటికీ వైద్యుడి మృతదేహాన్ని దహనం చేశారని ఆరోపించారు.

Show comments