West Bengal: రణరంగాన్ని తలపించిన పశ్చిమ బెంగాల్.. పోలీసుపై దాడి వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. నడి రోడ్లపై రాళ్లు రువ్వడం, కట్టెలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకుని దాడి చేయడం వంటివి చాలా చోట్ల కనిపించాయి. ఓ పోలీసు అధికారిపై నిరసనకారుల దాడి కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మహిళపై పోలీసుల లాఠీచార్జ్ వీడియో కూడా వైరల్ అయింది. పగటిపూట నగరంలోని కొన్ని ప్రాంతాలు యుద్ధ ప్రాంతంగా మారాయి. అక్కడ ఒక వైపు రాళ్ళు మరొక వైపు లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఒక పోలీసు వాహనాన్ని కూడా తగులబెట్టారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఎంపీ లాకెట్ ఛటర్జీ సహా కొందరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసాత్మక నిరసనల తర్వాత రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ, టీఎంసీలు ఒకదానిపై ఒకటి ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నాయి. పోలీసులు రెచ్చగొట్టడం వల్లే ఇంత హింస చెలరేగిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
పోలీసుపై దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో ఈ వీడియో ప్రారంభమైంది. అతను తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తాడు. కొందరు అతనిపై దెబ్బల వర్షం కురిపించినప్పుడు తన తలను రక్షించుకోవడానికి ఫైబర్ గ్లాస్ షీల్డ్ పట్టుకున్నాడు. ఆ పోలీసు అధికారి తన హెల్మెట్‌ను భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన తలను కాపాడుకున్నారు. ఎలాగోలా ఆ మూక నుంచి తప్పించుకుని బయట పడగా.. తెల్ల చొక్కా వేసుకున్న మరో వ్యక్తి ఆ పోలీసు అధికారిని దారుణంగా అడ్డుకున్నాడు. ఆయన ఒక్క ఉదుటన ఆగిపోయాడు. ఓ వ్యక్తి రాయితో వేగంగా కొడుతున్న దృశ్యం వీడియోలో చూడొచ్చు. ఆ రాయి వెళ్లి పోలీసు పొట్టపై తాకింది. ఇతరులు కర్రలతో ఆ పోలీసును కొట్టారు. మరికొందరు చేతులతోనే చితకబాదారు. ఇందులో చాలా మంది బీజేపీ జెండాలు పట్టుకుని ఆ పోలీసుపై దాడి చేసినట్లు కనిపిస్తుంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఆ పోలీసు అక్కడి నుంచి కూడా తప్పించుకుని బారికేడ్లు పెట్టిన వైపు పరిగెత్తాడు. ఇంతలోనే కొందరు ఎదురుగా వచ్చి అతడిని నెట్టేశారు. ఆయన పక్కనే ఉన్న స్కూటీపై పడిపోయారు. ఆ తర్వాత కింద పడిపోయారు. ఆయన చుట్టు చాలా మంది చేరి మళ్లీ దాడి చేశారు. ఇంతలో బ్లూకలర్ టీ షర్ట్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ పోలీసును కాపాడారు. బహుశా వారు స్థానికులు అని చెబుతున్నారు. ఆ పోలీసు అధికారి చేయి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.
Brutally beaten a police officer. This is not at all tolerated in the country. #ShameonBJP #BanBJP pic.twitter.com/L2Gfhm8OEw
— Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 (@CSM_NRIBRSUK) September 13, 2022
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!