Site icon NTV Telugu

Rajiv Ghai: ఆపరేషన్ సింధూర్పై డీజీఎంవో ప్రెస్మీట్.. కోహ్లీ రిటైర్మెంట్పై చర్చ

Rajiv

Rajiv

Rajiv Ghai: ఆప‌రేష‌న్ సింధూర్ గురించి ఇవాళ డీజీఎంవోలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ మీటింగ్ లో లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఓ క్రికెట్ స్టోరీ చెప్పుకొచ్చారు. మ‌న ఎయిర్ ఫీల్డ్‌ల‌ను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయ‌డం చాలా క‌ఠిన‌మైన అంశ‌మని తెలిపారు. ఈ అంశాన్ని ఆయ‌న వివ‌రిస్తూ.. క్రికెట్ లో జరిగిన ఓ సంఘ‌ట‌నను గుర్తు చేసుకున్నారు. అయితే, ఈరోజు విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.. అతను నా ఫెవ‌రేట్ క్రికెట‌ర్ అని పేర్కొన్నారు.

Read Also: Home Minister Anitha: అధికారులపై హోంమంత్రి అనిత సీరియస్‌.. చర్యలు తప్పవని వార్నింగ్..

అయితే, 1970 దశబ్దంలో యాషెస్ సిరీస్ ఒక‌టి జ‌రిగింది.. ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అప్పుడు, ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన‌ప్‌ను ఆసీస్ బౌల‌ర్లు జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీలు కూల్చేశార‌ు.. దీంతో ఆ స‌మ‌యంలో ఆస్ట్రేలియాలో ఓ నానుడి వెలుగులోకి వచ్చింది.. యాషెస్ టూ యాసెస్‌, డ‌స్ట్ టు డ‌స్ట్‌, ఇఫ్ థామో డోంట్ గెట్ యా, లిల్లీ మ‌స్ట్‌ అనే ప్రావ‌ర్బ్ పుట్టింద‌న్నారు.

Read Also: Ram Charan : చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..

అంటే ఒక‌వేళ ఆసీస్ బౌలర్ జెఫ్ థాంప్సన్ ను తప్పించుకున్నా.. డెన్నిస్ లిల్లీకి ఇంగ్లాండ్ బ్యాట‌ర్ చిక్కాల్సిందే అనే రీతిలో ఆ స్టేట్మెంట్ ఉందని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప‌రిశీలిస్తే, నేను చెప్పేది మీకు అర్థం అవుతుంద‌ని అనుకుంటున్నాను.. ఒక‌వేళ అన్ని పొర‌లు దాటినా.. ఈ వ్యవస్థలోని ఏదో దగ్గర గ‌ట్టి ప్రతిఘటనను పపాకిస్థాన్‌కు త‌న‌దైన స్టైల్ లో ఇండియా ఇస్తుందని ఘాయ్ వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version