Site icon NTV Telugu

K.Keshava Rao: బీఆర్ఎస్ కు మరో షాక్.. నేడు కాంగ్రెస్ లోకి కేకే..

K. Keshavarao

K. Keshavarao

K.Keshava Rao: తెలంగాణలో చేరిక అంశం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఎంపీ కే. కేశవరావు కలిశారు. కేకే తో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అనంతరం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Read also: Charlapalli Jail: చర్లపల్లి జైలులో జాబ్ మేళా.. ఖైదీలకు ఉపాధి కల్పించనున్న జైళ్ల శాఖ

బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన కేకే.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. అనంతరం కేకేతో పాటు ఆమె కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్‌ఎస్‌ ను వీడారు. మే నెలలోనే విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరగా, కేకే ఇంకా ఆ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏఐసీసీ నేతల సమక్షంలో కేకే పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈరోజు కేకేతో పాటు మరెవరైనా చేరబోతున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది.

Read also: KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు.. కేటీఆర్ ఆగ్రహం..

గత కొద్ది రోజులుగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు సంబంధించి కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండితో ఆషాడ మాసం ప్రారంభం కానుంది. రేపు ఒక్కరోజే ఒకే ఒక్క ఛాన్స్ ఉన్నందున ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే కేబినెట్ లో స్థానం, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో అధిష్టానం ఎవరికి సై అంటుంది.. ఎవరికి నో చెప్పబోతుందనేది కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠగా మారింది.
CMRF Applications: జులై 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు.. ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరణ..

Exit mobile version