Wedding: పెళ్లికూతురికి ముద్దుపెట్టిన వరుడు.. పొట్టుపొట్టు కొట్టిన వధువు కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding: హాయిగా సాగాల్సిన పెళ్లి వేడులకు కుస్తీ పోటీని తలపించింది. పెళి వేడుకలోనే పెళ్లికూతురు బంధువులు, వరుడి కుటుంబంపై దాడి చేశారు. వీటన్నింటికి ఓ ‘ముద్దు’ కారణమైంది. పెళ్లివేడుల సమయంలో వరడు, వధువుకు ముద్దు పెట్టాడు. తన ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడమే ఆయన చేసిన తప్పు. వరమాల వేడుక సమయంలో పెళ్లి పెటాకులైంది. వేదికపై ఉన్న వరుడి బంధువులను వధువు కుటుంబ సభ్యులు కొట్టడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.
ఈ ఘటన సోమవారం ఉత్తర్ ప్రదేశ్ హాపూర్‌లోని అశోక్ నగర్లో చోటు చేసుకుంది. వరుడు, వధువుకు ముద్దుపెట్టుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపటికే వధువు కుటుంబ సభ్యులు కర్రలు పట్టుకుని వేదికపైకి ఎక్కి వరుడి కుటుంబీకులను కొట్టారు. ఈ ఘర్షణలో వధువు తండ్రి సహా ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Also Read
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
Read Also: Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన హమాస్, హౌతీ, తాలిబాన్ లీడర్స్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి వధువు తండ్రి తన ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించారు. మొదటి పెళ్లి ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగింది. అయితే రెండో పెళ్లి మాత్రం కుస్తీ పోటీని తలపించింది. వరుడు, వధువుకు బలవంతంగా ముద్దు పెట్టాడని వధువు తరుపు బంధువులు పేర్కొనగా, వరమాల తర్వాత తనను ముద్దు పెట్టుకోవాలని పెళ్లికూతురే కోరిందని వరుడు చెప్పారు. ఈ కేసులో ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని హాపూర్ సీనియర్ పోలీసు అధికారి రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు.
ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాలు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాయి. అయితే, వధూవరులు మాత్రం తామిద్దరం పెళ్లి చేసుకోవాలనే కోరికను పెద్దలకు చెప్పారు. దీంతో పెద్దల జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలతో చర్చలు ప్రారంభించారు. పెళ్లిని తర్వాత తేదీకి మార్చాలనే ఉద్ధేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
-
IND vs AFG: ముల్లన్‌పూర్‌లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్‌పై 300 పరుగుల తేడాతో విజయం!
-
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!