Kishan Reddy On Central Budget 2023 Criticism: తెలుగు రాష్ట్రాలపై వివక్ష చూపారంటూ.. కేంద్ర బడ్జెట్‌పై వస్తున్న విమర్శల్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. తెలంగాణపై కానీ, తెలుగు రాష్ట్రాలపై కానీ వివక్ష లేదని.. ఎవరెన్ని అప్పులు చేశారో లెక్కలు తీస్తే తెలుస్తుందని తిరిగి కౌంటర్ ఇచ్చారు. వర్తమాన కాలంలోని అనుభవాలను పరిగణలోకి తీసుకొని.. దూరదృష్టితో ఈ బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. దేశంలోని అన్ని శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునేలా ఈ బడ్జెట్‌ని సృష్టించారన్నారు. బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదని, దేశ ప్రగతికి సంబంధించిన విషయమని అన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే లక్ష్యంతో ఈ బడ్జెట్‌ని రూపొందించారన్నారు.
Pragya Jaiswal: బాలయ్య హీరోయిన్ బికినీ ఏస్తే దబిడిదిబిడే..
ఏ పేదవాడి ఇంట్లో తినడానికి వంట ఆగకుండా ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 9 ఏళ్లుగా సుస్థిర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ కృషి చేస్తోందన్ననారు. హైదరాబాద్‌లో ఎఫిగ్రఫి మ్యూజియం ఏర్పాటు చేస్తామని, తాళపత్ర గ్రంథాలను డిజిలైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. మ్యాన్ హోల్స్‌ను మిషన్ హోల్స్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో పది శాతం నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు కేటాయించారన్నారు. తెలంగాణలో ఆర్ఆర్ఆర్ కోసం కేంద్రం ప్రకటించిన రూ.500 కోట్లు నిధులు కేటాయించామన్నారు. రాష్ట్ర వాటా కింద ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌కి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. యూరియా పరిశ్రమ ప్రారంభానికి రాని వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
INDvsNZ T20: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం..సిరీస్ కైవసం
ఇదే సమయంలో సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు శాపమని ఆరోపించారు. కేంద్రమంత్రి లేఖ రాస్తే.. సీఎం నుంచి రిప్లై రాలేదని, కనీసం ఉత్తరం అందిందని కూడా సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలాంటివాళ్లా తనని విమర్శించేదని ఫైర్ అయ్యారు. తనని విమర్శించే నైతిక హక్కు వాళ్లకు లేదని, తనకు చేతనైంది చేస్తున్నానని అన్నారు. తాను కల్వకుంట్ల కుటుంబానికి జవాబుదారి కాదని.. ప్రజలకు జవాబుదారిగా ఉంటానని వెల్లడించారు.
Revanth Reddy: తెలంగాణకు అన్యాయం జరిగింది.. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ దోషులే