INDvsNZ T20: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం..సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్.. బౌలింగ్‌లో అదరగొట్టడంతో 168 రన్స్ భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీ20ల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 235 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ 12.1 ఓవర్లలో 66 రన్స్ చేసి ఆలౌటైంది. భారత బౌలర్లు దుమ్మురేపడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఓపెనర్ ఫిన్ అలెన్ (3)ను మొదటి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపిన పాండ్యా కివీస్ వికెట్ల ఖాతా తెరిచాడు. అనంతరం రెండో ఓవర్లో కాన్వే (1), చాప్‌మన్ (0)ను ఔట్ చేసిన అర్చదీప్ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫిలిప్స్ (2), బ్రేస్‌వెల్ (8) శాంట్నర్ (13) కూడా పూర్తిగా విఫలమవడంతో 9ఓవర్లలోనే 53 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డారైల్ మిచెల్ (35) ఒక్కడే పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు కరవవడంతో కివీస్ భారీ ఓటమి మూటగట్టుకుంది. ఇండియా బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ 4 వికెట్లతో అదరగొట్టగా.. అర్షదీప్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
కాగా, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అద్భుత ఫామ్‌తో ఇరగదీస్తున్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టీ20ల్లో తొలి సెంచరీ (63 బంతుల్లో 126 నాటౌట్) తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 234 /4 స్కోర్ చేసింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలమయ్యాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి (44) కలిసి గిల్ బాదుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ప్రతర్థి బౌలర్లను ఆడుకోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే తొమ్మిదో ఓవర్లో త్రిపాఠిని ఔట్ చేసిన సోధి రెండో వికెట్‌కు 80 రన్స్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆపై సూర్యకుమార్ (24) గిల్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే 12 ఓవర్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య ఔటైనా.. గిల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. లిస్టర్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు టిక్నెర్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు సిక్స్‌లు ఓ ఫోర్ బాది సెంచరీకి దగ్గరగా వచ్చాడు. ఆపై 18వ ఓవర్లో మరో సిక్స్ బాది టీ20ల్లో మొదటి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక, హార్దిక్ (30) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించడంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!