ఎమ్మెల్యేల కొనుగులో విషయం తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. సీఎం కేసీఆర్ దీనిపై నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరు ఘాటుగా స్పందిస్తూ మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మీ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదని సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చూపెట్టిన వీడియోలో ఏముందో మాకు అర్ధం కాలేదని అన్నారు. తెలంగాణలో ఏ విషయం ఉన్నా అధిష్టానం మాతో మాట్లాడుతుందని అన్నారు. మాకు టీఆర్‌ఎస్ ప్రభత్వం పడిపోవాలని లేదని స్పష్టం చేశారు.
read also: Pakistan: పాక్ రాజకీయం సమస్తం నెత్తుటి చరిత్రే.. తిరుగుబాట్లు, హత్యలే
కేసీఆర్ ముందే రాజీనామా చేస్తా అన్నా మాకు షెడ్యూల్ ప్రకారమే మాకు ఎన్నికలు జరగాలని ఉందని తెలిపారు. కొడుకు ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదని, స్పెషల్ స్టేటస్ పేరుతో గతంలో టీడీపీ సర్కార్ మాపై బురద జల్లిందని గుర్తు చేశారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నేను రోజు వెయ్యి మందితో ఫోటో దిగుతా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కిషన్ రెడ్డి. బయటి వ్యక్తి ద్వారా బేరసారాలు జరిపే ఖర్మ మాకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాల ఆరోపణలతో ఆడియోలు, వీడియోలు తీశారని ఆరోపించారు. బీజేపీ మొదట్నుంచీ ప్రత్యేక విచారణ కావాలని కోరామని గుర్తు చేశారు.