Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్‌గాంధీపై కేంద్రం సంచలన నిర్ణయం..

Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించడంపై కేంద్రం సీరియస్ అయింది. రాహుల్ గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకనేందుక సిద్ధమైంది. ఆయనపై ‘‘సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం’’ పెడుతున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. సాయంత్రం 5 గంటల్లోపు స్పీకర్ కార్యాలయంలో హాజరుకావాలని రాహుల్ గాంధీకి కేంద్రం అల్టిమేటం విధించింది.

Read Also: T20 World Cup: ‘‘మా క్రికెటర్ల నిర్ణయం ఇది’’.. టీ20 వరల్డ్ కప్‌పై బంగ్లాదేశ్ యూ-టర్న్..

ఈ రోజు జరిగిన సమావేశాల్లో భారత్ అమెరికా హద్య ట్రేడ్ డీల్‌పై మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతలపై రాముల్ గాంధీ అసత్య ఆరోపణలు చేశారని కేంద్రం చెప్పింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో హర్దీప్ సింగ్ పూరిని ముడిపెడుతూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ట్రేడ్‌డీల్‌పై మాట్లాడుతూ ‘‘భారత దేశాన్ని అమ్మేశారు.. మీకు సిగ్గు లేదా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక సభ్యుడిపై మరో సభ్యుడు తీవ్ర ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు, ముందస్తు నోటీసులు ఇవ్వాలని, నిబంధనలకు అనుగుణంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కిరెన్ రిజిజు అన్నారు.

Exit mobile version